మన భారత్, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లాలో తపాలా శాఖకు చెందిన నిధుల దుర్వినియోగం కేసు కలకలం రేపుతోంది. తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రుయ్యడి గ్రామానికి చెందిన గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అబ్దుల్ నిజాం తన విధుల్లో ఉండగా రూ.2,12,033/- మొత్తాన్ని అక్రమంగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిధులను తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ ఘటనపై పోస్టల్ ఇన్స్పెక్టర్ నాగిరెడ్డి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తలమడుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
దర్యాప్తు అనంతరం నిందితుడిని ఆదిలాబాద్ రూరల్ సీఐ కే. ఫణిధర్ ఆధ్వర్యంలో న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రక్రియలో తలమడుగు ఎస్సై డి. రాధిక కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
