మన భారత్, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన శబరిమాత ఆశ్రమాన్ని మాజీ జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆశ్రమాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆశ్రమ నిర్మాణానికి ముందుండి సేవలందించిన గోక గణేష్ రెడ్డి దంపతులను ఆశ్రమ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉడుగు రాకేష్, మాజీ సర్పంచ్ మోతి రాజమల్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆశ్రమ నిర్మాణాన్ని అభినందించారు.

అలాగే వార్డ్ సభ్యులు ఎన్ అశోక్, జె ఉత్తమ్, ఎస్ రమాకాంత్, కమిటీ సభ్యులు ఎం శ్రీనివాస్, జి వెంకట్ రెడ్డి, ఎల్ ప్రవీణ్ రెడ్డి, జి సాంబశివ్ తదితరులు హాజరయ్యారు. గ్రామ పెద్దలు జి గంగన్న, జి సంజీవ్ రెడ్డి, ఎల్ మోహన్ రెడ్డి, ఏ అయ్యన్న, టీ గంగారెడ్డి, ఎన్ గంగాధర్, ఎం వెంకట రెడ్డి, గొల్ల మల్లేష్, సాయికిరణ్, పి గంగన్న, కె భూమన్నతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఆశ్రమం గ్రామంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

