జాతీయ రహదారులను విస్తరించాలి: ఎంపీ నగేష్ 

Published on

-Advertisement-

మన భారత్ , ఆదిలాబాద్:

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యవసరమని ఎంపీ శ్రీ గోడం నగేష్ పార్లమెంట్ వేదికగా ప్రస్తావించారు. పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారులను విస్తరించి ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ఆదిలాబాద్ నుంచి మల్కాజిగిరి వరకు ప్రస్తుతం ఉన్న నాలుగు లైన్ల జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలని ఎంపీ సూచించారు. ఈ మార్గంలో వాహన రాకపోకలు గణనీయంగా పెరుగుతున్నాయని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

అదేవిధంగా, ఎన్‌హెచ్ 44 గుడిహత్నూర్ నుంచి ఎన్‌హెచ్ 63 ఆసిఫాబాద్–అల్లాపూర్ వరకు రహదారులను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అలాగే ఎన్‌హెచ్ 44 బోరాజ్ నుంచి జందాపూర్, మాండ్వి, మాహోర్ వరకు విస్తరణ చేపట్టడంతో పాటు ఎన్‌హెచ్ 63 నిర్మల్ రూట్‌ను మెరుగుపరచాలని సూచించారు.

ఈ రహదారి ప్రాజెక్టులు అమలు అయితే ప్రాంతీయ రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, వ్యాపార, పరిశ్రమల అభివృద్ధికి కూడా ఊతమిస్తాయని ఎంపీ గోడం నగేష్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ లభించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఉన్న రహదారులు పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయని, తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన వివరించారు. రహదారుల విస్తరణతో పాటు భద్రతా చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు.

ప్రజల ప్రయాణ సౌలభ్యం, భద్రత దృష్ట్యా ఈ ప్రాజెక్టులను ప్రాధాన్యంగా తీసుకుని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రిత్వ శాఖలను ఎంపీ విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు రహదారుల శాఖ అధికారులను కూడా ఈ అంశంపై స్పందించాలని కోరారు.

Latest articles

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య...

గ్రామాల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి పునాది: సర్పంచ్ నిఖిత

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సఖినాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర గీతాలాపనతో అమరవీరులకు నివాళులు...

అమరుల త్యాగ ఫలితమే స్వరాష్ట్రం..

కుచులాపూర్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జాతీయ పతాకావిష్కరణతో అమరవీరులకు నివాళులు – పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ...

తెలంగాణ సాధనలో యువత త్యాగాలు చిరస్మరణీయం

పల్లి (బి) గ్రామంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమరవీరులకు నివాళులు అర్పించిన గ్రామ ప్రజలు మన భారత్,...

More like this