e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

స్మశానమా నీవు నిజం చెప్పకు.!

– అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు

– విద్యార్థిని మృతదేహానికి రీ-పోస్టుమార్టం

మన భారత్, తెలంగాణ: 

నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థిని సాయి లిఖిత మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవడంతో, మంగళవారం మృతదేహాన్ని వెలికి తీసి రీ-పోస్టుమార్టం నిర్వహించారు.

డిసెంబర్ 6న అస్వస్థతకు గురైన సాయి లిఖిత(14)ను తొలుత స్థానికంగా చికిత్స అందించి, అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే ఈ మరణం సహజమా, లేక నిర్లక్ష్యానికి ఫలితమా అన్న అనుమానాలు తల్లిదండ్రులు వ్యక్తం చేయడంతో కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.

మృతురాలి కుటుంబ సభ్యులు మొదట స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నం చేసిన కేసు నమోదు కాలేదని ఆరోపించారు. జిల్లాస్థాయి అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని వాపోయారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించడంతో సోమవారం కేసు నమోదు అయింది. ఈ పరిణామాల మధ్య మృతదేహాన్ని వెలికి తీసి రీ-పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్ష ద్వారా అసలు మృతికారణం బయటపడే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

మృతురాలి తండ్రి దేవునూరు లింగన్న మాట్లాడుతూ, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే తన కుమార్తె మృతికి కారణమని ఆరోపించారు. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదే కేసుతో సంబంధం ఉన్న ఏఎన్ఎం మరణం కూడా అనుమానాస్పదంగా ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అది సహజ మరణమా, ప్రమాదమా లేదా హత్య కోణంలో జరిగిందా అన్న అంశంపై కూడా విచారణ జరపాలని కోరుతున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా, రీ-పోస్టుమార్టం నివేదికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తాంసి శ్మశాన వాటికలో మంగళవారం సమాధి నుంచి మృత దేహాన్ని బయటకు తీసి తహసీల్దార్ లక్షీ, మెండొర ఎస్సై సుహాసిని సమక్షంలో వైద్యుడు అంకిత్ రావు శవ పంచనామ నిర్వహించి, నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. ఇదిలా ఉండగా, ఈ అంశాన్ని బీఆర్‌ఎస్ గౌరవాధ్యక్షులు కేటీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించడంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సంఘటన జరిగిన మూడు నెలల తర్వాత FIR నమోదు కావడం, అనంతరం రీ-పోస్టుమార్టం చర్యలు చేపట్టడం గమనార్హం.

హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే..

నా కూతురు సాయి లిఖిత హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చచ్చిపోయింది. పోలీసులు అధికారుల చుట్టూ మూడు నెలలు తిరిగిన కేసు నమోదు చేయలే. నిజాంబాద్ సిపి సార్ దగ్గరికి పోతే నిన్న కేసు నమోదు అయి రీ పోస్టుమార్టం లో చేసిండ్రు. ఏ కన్న తల్లిదండ్రులకు ఇట్లా జరగకూడదు. మాకు న్యాయం జరగాలి.

– దేవునూరు లింగన్న, విద్యార్థిని తండ్రి, తాంసి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE