స్మశానమా నీవు నిజం చెప్పకు.!
- అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు – విద్యార్థిని మృతదేహానికి రీ-పోస్టుమార్టం మన భారత్, తెలంగాణ: నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థిని సాయి లిఖిత మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవడంతో, మంగళవారం మృతదేహాన్ని వెలికి తీసి రీ-పోస్టుమార్టం నిర్వహించారు. డిసెంబర్ 6న అస్వస్థతకు గురైన సాయి లిఖిత(14)ను తొలుత స్థానికంగా చికిత్స అందించి, అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి...