కాంగ్రెస్ నేతల ఉగాది వేడుకలు.!

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్: 

ఆదిలాబాద్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత మాట్లాడుతూ ఉగాది పండుగ మన తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధి కోసం ప్రజలందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ ఉగాది ప్రతి కుటుంబానికి శుభం, సంతోషం తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, దస్నాపూర్ కౌన్సిలర్ సాయి చరణ్ గౌడ్, యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు వేముల, మాజీ కౌన్సిలర్ సంజయ్, మంగేష్, దౌలత్ రావ్, చిందం రఘ తదితరులు పాల్గొన్నారు.

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this