ఫిబ్రవరి 11న మునిసిపల్ పోలింగ్? ఈ నెల 27న షెడ్యూల్ విడుదలకు సంకేతాలు
మన భారత్ , తెలంగాణ: తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై రాజకీయ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదలై, ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఈ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 116 మునిసిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. స్థానిక సంస్థలపై పట్టు సాధించేందుకు...