🚨 ALERT: ఈ లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి..

Published on

-Advertisement-

సైబర్ మోసాల పట్ల జాగ్రత్త.!

మన భారత్/ దేశవ్యాప్తంగా:

ఇటీవల రెండు రోజులుగా ‘PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్’ పేరిట రూ.5,000 పొందొచ్చంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఓ సందేశం వేగంగా వైరల్ అవుతోంది. ఈ సందేశాల వెనుక సైబర్ కేటుగాళ్లు ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమాయకులను మభ్యపెట్టి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడమే లక్ష్యంగా ఈ మోసాలు సాగుతున్నాయని వెల్లడించారు.

ఇదే తరహాలో తాజాగా SBI బ్యాంక్ పేరుతోనూ నకిలీ లింకులు, APK ఫైల్స్‌ను పంపిస్తూ ఖాతాలను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. “రూ.9,980 రివార్డ్ పాయింట్లు ఎక్స్‌పైరీ అవుతున్నాయి”, “రూ.5,000 గిఫ్ట్ మీ ఖాతాలో జమ అవుతుంది” వంటి ఆకర్షణీయమైన సందేశాలతో లింకులు పంపి, వాటిపై క్లిక్ చేయగానే మొబైల్ ఫోన్ నియంత్రణను సైబర్ నేరగాళ్లు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు.

ఈ లింకుల ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు చోరీ చేసి అకౌంట్ల నుంచి డబ్బులు దోచుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేస్తే మొబైల్ పూర్తిగా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.

సాధారణంగా బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ యాప్స్ ఇలాంటి గిఫ్ట్ లింకులను వాట్సాప్ ద్వారా పంపవని గుర్తుంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లింక్స్, ఫైల్స్‌పై క్లిక్ చేయకుండా, అలాంటి సందేశాలను వెంటనే డిలీట్ చేయాలని సూచించారు. మోసపోయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this