e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, October 18, 2026

అసెంబ్లీ నిరవధిక వాయిదా… 13 బిల్లులు, 2 తీర్మానాలకు ఆమోదం

అసెంబ్లీ నిరవధిక వాయిదా… 13 బిల్లులు, 2 తీర్మానాలకు ఆమోదం

మన భారత్, తెలంగాణ:

తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఐదు రోజుల పాటు సాగిన ఈ సమావేశాల్లో సభ మొత్తం 40 గంటల 45 నిమిషాల పాటు నిర్వహించబడింది. ఈ సెషన్‌లో కీలకమైన 13 బిల్లులు, 2 తీర్మానాలను శాసనసభ ఆమోదించింది.

ఈ సమావేశాల్లో కృష్ణా జలాల అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే ఈ చర్చకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి రోజున మాత్రమే సభకు హాజరై సంతకం చేసి వెళ్లారు. అనంతరం మిగిలిన సమావేశాలకు ఆయన హాజరుకాలేదు.

ప్రభుత్వం ప్రతిపాదించిన పలు అభివృద్ధి, పరిపాలన సంబంధిత అంశాలపై సభలో చర్చలు జరిగాయి. అధికార పక్ష సభ్యులు చురుకుగా పాల్గొనగా, ప్రతిపక్ష గైర్హాజరు నేపథ్యంలో సమావేశాలు ప్రధానంగా ప్రభుత్వ వాదనలతోనే కొనసాగాయి. చివరికి అవసరమైన అన్ని కార్యాచరణ పూర్తికావడంతో శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE