అండర్ బ్రిడ్జి పనులకు శ్రీకారం..

Published on

-Advertisement-

తాంసి బస్టాండ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు శ్రీకారం: ఎంపీ గోడం నగేష్ భూమి పూజ

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో ప్రయాణికులు, వాహనదారులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రాకపోకల సమస్యకు పరిష్కారంగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ , ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ తో కలిసి బుధవారం రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

ఈ అండర్ బ్రిడ్జి నిర్మాణంతో రైల్వే క్రాసింగ్ వద్ద తరచూ ఏర్పడే ట్రాఫిక్ అంతరాయం తగ్గి, తాంసి, ఆదిలాబాద్ పట్టణానికి వెళ్లే ప్రయాణికులకు సురక్షితమైన, సులభమైన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా అత్యవసర సేవలు, పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్  మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, ప్రజల ఇబ్బందులను గుర్తించి మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. తాంసి బస్టాండ్ ప్రాంతంలో అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి రాజు (గంగాధర్ రావు) , జీ.వి. రమణ, కనపర్తి చంద్రకాంత్, బోండ్ల వెంకట స్వామి, తుకారాం, నానం రమణ తదితర నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this