ఎల్లుండి మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా..

Published on

-Advertisement-

ఎల్లుండి మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్  ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

మన భారత్, హైదరాబాద్:

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్‌ను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే చిరంజీవి చేతిలో గన్ పట్టుకున్న పోస్టర్‌ను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కథకు తగ్గట్టుగా మాస్, ఎంటర్‌టైన్‌మెంట్ మిశ్రమంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు.

సాహూ గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందించగా, ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఫుల్ మాస్ అవతార్‌లో దర్శనమివ్వనున్నాడన్న వార్తతో అభిమానులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this