e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

మున్నూరు కాపు ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

మున్నూరు కాపు ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాలో మున్నూరు కాపు కులానికి చెందిన ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాసేవలో అడుగుపెట్టడం పట్ల మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.

అర్లీ(బి) గ్రామానికి చెందిన ఆకుల వెంకన్న సర్పంచిగా ఎన్నికైన సందర్భంగా, అలాగే అదే గ్రామానికి చెందిన పడాల దయాకర్ ఉప సర్పంచిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షుడు తోట శివన్న, ప్రధాన కార్యదర్శి బొల్లు ఈశ్వర్ దాస్, సభ్యులు వద్ది రవికాంత్‌తో పాటు మున్నూరు కాపు కుల బాంధవులు పాల్గొని వారిని శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.

అదేవిధంగా జందాపూర్ గ్రామానికి చెందిన ఉప్పల కృష్ణవేణి సంతోష్ ఉప సర్పంచిగా ఎన్నికైన సందర్భంగా కూడా మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తోట శివన్న, ప్రధాన కార్యదర్శి బొల్లు ఈశ్వర్ దాస్, సభ్యులు వద్ది రవికాంత్, జిమ్ ఆడేల్లు తదితరులు పాల్గొని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

మరొక వైపు, అసీంపూర్ కేర్గామా గ్రామానికి చెందిన గాజుల సంజీవ్ సర్పంచ్‌గా ఎన్నికైన సందర్భంగా కూడా మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ నేతలు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు తోట శివన్న, ప్రధాన కార్యదర్శి బొల్లు ఈశ్వర్ దాస్, సభ్యులు వద్ది రవికాంత్, కేర్గామా గ్రామ మున్నూరు కాపు మాజీ ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి దేవన్నతో పాటు కుల బాంధవులు పాల్గొన్నారు. గాజుల సంజీవ్‌కు మిఠాయి తినిపించి, శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మున్నూరు కాపు కులానికి చెందిన యువత ప్రజాప్రతినిధులుగా ఎన్నికై గ్రామాల అభివృద్ధికి నాయకత్వం వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పారదర్శకంగా, నిబద్ధతతో పాలన అందించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE