ఐబొమ్మ కేసులో ఈడీ ప్రవేశం..

Published on

-Advertisement-

ఐబొమ్మ కేసులో ఈడీ ప్రవేశం – మనీలాండరింగ్‌ కోణంపై దృష్టి

మన భారత్, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఐబొమ్మ కేసులో ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు పంపించాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌కు ఈడీ అధికారిక లేఖ రాసింది. ఐబొమ్మ వ్యవహారంలో భారీ స్థాయిలో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానం నేపథ్యంలో ఈడీ ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించింది.

కేసులో ప్రధాన నిందితుడు రవి ఖాతాల నుంచి ఇప్పటివరకు రూ.3.5 కోట్లు ఫ్రీజ్ చేసినట్టు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. నెట్‌వర్క్ ఖర్చులు, డిజిటల్ ట్రాన్సాక్షన్లు, విదేశీ ఫండింగ్‌ వంటి అంశాలను కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 14న అరెస్టైన రవి ప్రస్తుతం చంచల్‌గూడ సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. సైబర్ నేరాలు, కాపీరైట్ ఉల్లంఘనలు, విదేశీ లావాదేవీలు వంటి అంశాలపై ఈడీ మరింత లోతుగా విచారణ జరపనుంది. ఇప్పటికే పలు డిజిటల్ పరికరాలు, సర్వర్లు, డొమైన్‌ లింకులు పరిశీలనలో ఉన్నాయి.

ఈడీ అడుగుపెట్టడంతో కేసు మరింత వేగం పందే అవకాశం ఉందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this