e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, November 27, 2026

గవర్నర్ పర్యటన షెడ్యూల్ విడుదల చేసిన కలెక్టర్

గవర్నర్ పర్యటన షెడ్యూల్ విడుదల చేసిన కలెక్టర్
– నవంబర్ 30న జగిత్యాల జిల్లాలో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పర్యటన
జగిత్యాల, నవంబర్ 26, మన భారత్ :
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ నెల 30వ తేదీన (సోమవారం) జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలోని మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్‌టీయూలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

గవర్నర్ పర్యటన షెడ్యూల్ వివరాలు:
గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తన సతీమణి శ్రీమతి జానకి శుక్లా, అధికారిక సిబ్బందితో కలిసి నవంబర్ 30వ తేదీ ఉదయం 9:20 గంటలకు హైదరాబాద్‌లోని లోక్‌భవన్ నుంచి బయలుదేరి 9:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 9:40 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10:30 గంటలకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్‌టీయూ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం ఉదయం 10:35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10:45 గంటలకు మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుకుంటారు. ఉదయం 10:45 నుంచి 11:30 గంటల వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, ఆశీర్వచనం, సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11:30 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి 11:40 గంటలకు నాచుపల్లిలోని జేఎన్‌టీయూకు చేరుకుంటారు. ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:45 నుంచి 1:30 గంటల వరకు భోజన విరామం. మధ్యాహ్నం 1:30 గంటలకు నాచుపల్లి జేఎన్‌టీయూ హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 2:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 2:25 గంటలకు బయలుదేరి 2:35 గంటలకు హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌కు చేరుకుంటారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE