e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

సర్ లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి – రోల్ అబ్జర్వర్ బి. బాల మాయాదేవి

సర్ లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
– రోల్ అబ్జర్వర్ బి. బాల మాయాదేవి
– ఎన్నికల సంఘం కొత్త గడువులు, మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలి
– అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోతే బాధ్యులపై చర్యలు తప్పవు
– క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఈ రోల్ అబ్జర్వర్
జగిత్యాల, నవంబర్ 25, మన భారత్ :
ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) 2026 ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ రోల్ అబ్జర్వర్ బి. బాల మాయాదేవి సూచించారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి, వివరాలను సరిచేసుకోవడానికి ప్రస్తుతం మంచి అవకాశం ఉందని, అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్‌ తో కలిసి ఎస్‌ఐఆర్‌ 2026 ప్రక్రియపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా రోల్ అబ్జర్వర్ బి. బాల మాయాదేవి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రతి విధివిధానాన్ని తప్పనిసరిగా పాటించాలని, తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన కొత్త గడువుల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితా నుంచి ఏదైనా ఓటరు పేరును తొలగించినప్పుడు అందుకు సరైన ఆధారాలు, సమర్థన ఉండాలని, అదేవిధంగా ఓటరు జాబితాలో పేరు చేర్చే ప్రతి అర్హత కలిగిన వ్యక్తికి సంబంధించిన వివరాలు కూడా నిబంధనల ప్రకారం ధ్రువీకరించబడాలని స్పష్టం చేశారు. అర్హత కలిగిన ఓటరు ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి ఏర్పడితే అందుకు బాధ్యులైన అధికారులపై పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇంకా 36 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో జగిత్యాల నియోజకవర్గంలో 35, ధర్మపురి నియోజకవర్గంలో ఒకటి ఉండగా, కోరుట్ల నియోజకవర్గంలో ఎలాంటి పెండింగ్ కేసులు లేవని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 36 కేసులను తక్షణమే పరిష్కరించి తుది ఓటరు జాబితా ప్రచురణను 100 శాతానికి తీసుకురావాలని అబ్జర్వర్ సూచించారు. సమీక్ష అనంతరం ఈ రోల్ అబ్జర్వర్ బి. బాలమాయా దేవి, జగిత్యాల ఆర్డిఓతో కలిసి జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌ లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పై క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ పనులను పరిశీలించి, బీఎల్‌ఓలను ప్రత్యక్షంగా కలిసి ఇప్పటివరకు నిర్వహించిన ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల పరిశీలన, ఫారాల స్వీకరణ, ఓటర్ల నుంచి సేకరించిన వివరాలపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 36 కేసులను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జగిత్యాల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న 35 కేసుల్లో జగిత్యాల అర్బన్‌లో 23, బీర్‌పూర్‌లో 10 కేసులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. ఈపీఐసీ కార్డుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ లోపాలు లేకుండా తుది జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓలు, తహసీల్దార్లు, ఏఓ కిషన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మార్గం ఆదిత్య మన భారత్ జగిత్యాల జిల్లా రిపోర్టర్ 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE