e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వేయి మందికి పైగా రైతుల ఆత్మహత్యలు: కేటీఆర్

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 1,000 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు: కేటీఆర్

రైతు వ్యతిరేక విధానాలే రైతుల బలవన్మరణాలకు కారణం.. తలమడుగులో మృతిచెందిన నలుగురు రైతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం

మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 1,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, వ్యవసాయ రంగంపై నిర్లక్ష్యమే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణమని విమర్శించారు. రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

బోథ్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో ఆత్మహత్య చేసుకున్న నలుగురు రైతుల కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.8 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు బీమా పథకాన్ని అమలు చేశామని గుర్తుచేశారు. రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందేలా ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.

రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించడం లేదని కేటీఆర్ విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు రైతులకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.

తలమడుగు మండలంలో రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ తరఫున ఆర్థిక సాయం అందించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE