e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి

జాతీయ ఐక్యత, సమగ్రతకు సర్దార్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయం

మన భారత్, తాంసి: అక్టోబర్ 31, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ మండలం తాంసి మండల కేంద్రంలోని మై భారత్ కేంద్రం ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ భాస్కర్ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యత, సమగ్రత కోసం చేసిన కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన జీవిత చరిత్ర, దేశం కోసం చేసిన సేవలను విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు. పట్టుదల, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అనంతరం విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం నుంచి అందించిన యూనిఫామ్‌లను సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మై భారత్ కేంద్రం ప్రతినిధి శశికుమార్, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు, రాజశేఖర్, మీనాక్షి, వాలంటీర్లు, గ్రామ ప్రజాప్రతినిధులు, సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి, క్లస్టర్ కో-ఆర్డినేటర్ మురేందర్, కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ భాస్కర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE