e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

దివ్యాంగుల సంక్షేమానికి కృషి..

దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు, స్కూటీలు పంపిణీ

ఉట్నూర్, ఆగస్టు 22: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ వారికి అవసరమైన సహాయ ఉపకరణాలను అందిస్తోందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఉట్నూర్‌లో నిర్వహించిన దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ జి. నగేష్ పాల్గొని దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు తో కలిసి ఎంపీ జి. నగేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన దివ్యాంగులకు అవసరమైన సహాయ ఉపకరణాలతో పాటు స్కూటీలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎంపీ జి. నగేష్ మాట్లాడుతూ.. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వయం ఆధారంగా జీవించేందుకు అవసరమైన సహకారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంపై కూడా ఉందన్నారు. వారికి అందిస్తున్న సహాయ ఉపకరణాలు రోజువారీ జీవనంలో, ఉపాధి అవకాశాల కోసం ప్రయాణించడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

దివ్యాంగుల అవసరాలను గుర్తించి వారికి అనుకూలమైన సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రజాప్రతినిధులు సూచించారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటిపల్లి గంగాధర్ రావు, మాజీ రైల్వే బోర్డు సభ్యులు జి.వి. రమణ తో పాటు అధికారులు, నాయకులు, దివ్యాంగుల కుటుంబ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE