e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

అప్పుల బాధతో రైతు బలవన్మరణం..

తలమడుగు, ఆగస్టు 7 (మన భారత్):

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయంలో వరుస నష్టాలు, అప్పుల ఒత్తిడి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో విషాదాన్ని నింపింది.

స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తలమడుగు మండలంలోని పల్లి (బి) గ్రామానికి చెందిన రైతు మోతె అశోక్ (48) గత ఏడాది సాగు కోసం చేసిన అప్పులు ఇంకా పూర్తిగా తీర్చలేకపోయాడు. ఇదే సమయంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో మళ్లీ వ్యవసాయ ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం ఆయన మృతి చెందారు.

రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తెలిసింది.

వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడి వ్యయం, పంటల అనిశ్చితి, అప్పుల భారం వంటి కారణాలతో రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించి, కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE