గ్రామాల‌ అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం..

Published on

-Advertisement-

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర

మన భారత్,మొగుళ్ళపల్లి:

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని ప్రజా సమస్య పరిష్కారం కోసం అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. గురువారం మండల కేంద్రంలోనీ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సురేందర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా హాజరై వివిధ శాఖల పనితీరును సమక్షించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు పారిశుద్ధ్యము, రహదారులు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, వ్యవసాయానికి అవసరమైన సదుపాయాలు కల్పించే విధంగా ప్రత్యేక దృష్టి ఉండాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో గ్రామాల సర్పంచ్లు గ్రామంలో రోడ్డు మరమ్మత్తులు, డ్రైనేజీ, తాగునీటి, భూసమస్యలను సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పిఎసి ఎస్ చైర్మన్ సంపెల్లి నర్సింగారావు,చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి రఫీ, నాయకులు ఆకుతోట కుమారస్వామి, క్యాతరాజు రమేష్, నడిగొటి రాము, ఏలేటి సదాశివరెడ్డి,తక్కల్లపల్లి రాజు, పోలినేని లింగారావు,చాట్ల రవీందర్, గజ్జి రాజుకుమార్ ,ఎర్రబెల్లి కోటేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఉద్యోగం పేరుతో రూ.2.06 లక్షల మోసం

ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం పేరుతో రూ.2.06 లక్షల మోసం నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 24:...

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలి..

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా విధానం తీసుకురావాలి. టీఆర్‌పీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రభుత్వ...

ఈ నెల 27న గ్రామ వార్డు సభలు షురూ..

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, ఆగస్టు 24: ఓటరు జాబితా...

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి చట్టపర చర్యలు

నిబంధనల ప్రకారం పరిష్కరిస్తాం: ఐటీడీఏ పీవో మకరందు ఉట్నూర్, మన భారత్ ఆగస్టు 24: ఆదివాసీలు ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యలను...

More like this