e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

పర్యావరణ పరిరక్షణపై అవగాహన..

తలమడుగు,ఖోడద్, సుంకిడిలో ఘనంగా వన మహోత్సవం

ఈత మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన

తలమడుగు మన భారత్:జూలై 29 పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తలమడుగు మండలంలోని తలమడుగు, కోదాడ్, సుంకిడి గ్రామాల్లో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గౌడ సంఘాల సభ్యులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది కలిసి ఈత మొక్కలను నాటారు.

తలమడుగు మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాల్లో ఈత మొక్కలను నాటడంతో పాటు కోదాడ్, సుంకిడి గ్రామాల్లోనూ గౌడ సంఘ సభ్యుల సహకారంతో మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వన మహోత్సవం ద్వారా ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై మరింత అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించడం కూడా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.

గౌడ సంఘాల సభ్యులు మాట్లాడుతూ ఈత చెట్లు గ్రామీణ జీవన విధానంతో ముడిపడి ఉన్నాయని, వాటి పెంపకంతో పర్యావరణ పరిరక్షణతో పాటు సంప్రదాయ వృత్తులకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించి పెద్ద చెట్లుగా ఎదిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్లు హరీష్, గౌతమ్, బీరయ్య, సుకన్య, తలమడుగు గౌడ సంఘ నాయకులు అందేరామా గౌడ్, తిరుపతి గౌడ్,సత్యం గౌడ్ తో పాటు గ్రామస్తులు కాటిపెల్లి రాంరెడ్డి, అశోక్, రాజు, రూపేందర్, బన్నీ, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాలు వారిగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE