e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

56 మంది విద్యార్థులకు ఒక్కరే టీచర్‌..!

ప్రజావాణిలో తల్లిదండ్రుల వినతి

తలమడుగు, జూలై 27: మండలంలోని కజ్జర్ల గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని తల్లిదండ్రులు కోరారు. పాఠశాలలో ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 56 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతో పిల్లల చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక్క ఉపాధ్యాయుడిపై పలు తరగతుల విద్యార్థుల బోధన బాధ్యత పడటంతో ప్రతి తరగతిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం కష్టంగా మారుతోందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం మరో ఉపాధ్యాయుడినైనా వెంటనే సర్దుబాటు చేసి పాఠశాలకు కేటాయించాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు తెలిపారు. తమ విజ్ఞప్తిపై అధికారులు సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయాలని వారు కోరుతున్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE