హాస్టల్ వార్డెన్‌ను బెదిరించి డబ్బులు వసూలు.. ఇద్దరు అరెస్ట్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరింపులు.. కోర్టు రిమాండ్
గతంలోనూ పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు
ఉట్నూర్, మన భారత్ జూలై 27: హాస్టల్ వార్డెన్‌ను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను ఉట్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డబ్బులు ఇవ్వకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి జైలుకు పంపిస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం..
ఉట్నూర్ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్‌ను కొంతకాలంగా నిందితులు ఫోన్ ద్వారా సంప్రదిస్తూ ఓ కార్యక్రమం పేరుతో డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో జూలై 26న హాస్టల్‌కు వెళ్లిన నిందితులు రూ.5 వేల ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి పదేళ్ల పాటు జైలుకు పంపిస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో వెల్లడైంది.
అంతేకాకుండా గత ఆరు నెలల కాలంలో ఇదే విధంగా రెండుసార్లు రూ.3 వేల చొప్పున మొత్తం రూ.6 వేల నగదును బలవంతంగా వసూలు చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 267/2026గా భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 329(4), 308(6) రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో నిందితుల ప్రమేయం నిర్ధారణ కావడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది.
అరెస్టైన నిందితులు
A1: నేతావత్ రాందాస్ @ నాయక్ (53)
తండ్రి: దివంగత రూప్లా, పాత ఉట్నూర్
A2: నేతావత్ జైల్‌సింగ్ @ జెల్‌సింగ్ (28)
తండ్రి: రాందాస్ నాయక్, పాత ఉట్నూర్
బెదిరింపులకు పాల్పడుతూ బలవంతపు వసూళ్లు, ఎక్స్‌టార్షన్ వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్ హెచ్చరించారు. ఎవరైనా బెదిరింపులకు గురైతే భయపడకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
