e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్..

గోమాత రక్షణకు ప్రజల్లో అవగాహన కల్పించాలి

దేవాపూర్‌లో గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్.. రైతుల నుంచి సంతకాల సేకరణ

తలమడుగు, మన భారత్ జూలై 26: గోమాత రక్షణ, గో సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ – గో గౌరవ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌కు చెందిన గోసేవకుడు దశరథ్ పటేల్ ఆధ్వర్యంలో గోమాత గౌరవ దినోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి, రైతులు, గ్రామస్థుల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా దశరథ్ పటేల్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గోమాత రక్షణ, గో సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. గోవులను భారతీయ సంస్కృతి, వ్యవసాయ జీవన విధానంలో కీలక భాగంగా పేర్కొంటూ వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా గోవధను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్‌తో పాటు, గోమాతను జాతీయ సంపదగా గుర్తించి తగిన గౌరవం, రక్షణ కల్పించాలనే అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గో సంరక్షణకు సంబంధించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, రైతులు, గోసేవకులు, గ్రామీణ ప్రజలను చైతన్యపరచడం ఈ అభియాన్ లక్ష్యమని వివరించారు.

మూడు నెలల పాటు గో గౌరవ దినోత్సవ కార్యక్రమాలు

గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్‌లో భాగంగా 2026 జూలై 27 నుంచి అక్టోబర్ 27 వరకు గో గౌరవ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ప్రజలకు గో సంరక్షణపై అవగాహన కల్పించడం, సంతకాల సేకరణ, ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

గోమాత రక్షణ – భారతీయ సంస్కృతి పరిరక్షణ, జై గోమాత – జై భారత్ అనే నినాదాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవాపూర్ గ్రామ సర్పంచ్ పొరండ్ల సంతోష్, బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు కిరణ్, వార్డు సభ్యులు అడెపు శ్రీనివాస్, ఓస రవి, సీపతి నగేష్, రేగుల మోహన్, శాగంటి విష్ణు, పోతుగంటి అశోక్, ఆశన్న, పోరన్ల రాములు, భూమన్న, శీను, వంశీ, గిరి, గోసేవకులు, రైతులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE