e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

విద్యార్థుల నిరసనకు బీఎస్పీ మద్దతు..

నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసనకు బీఎస్పీ మద్దతు

ఢిల్లీ పోలీసుల లాఠీచార్జీని ఖండిస్తూ ఆదిలాబాద్‌లో శాంతియుత నిరసన

ఆదిలాబాద్, జూలై 24: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీఎస్పీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ సూచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి బీఎస్పీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు మద్దతుగా నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బీఎస్పీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రత్నపురం రమేష్ మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ, విద్యా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు ప్రజలకు ఏమి న్యాయం చేయగలవని ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు.

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైతిక బాధ్యత తీసుకుని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ యువత, విద్యార్థులకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కాన్షీరాం అందించిన ఉద్యమ స్ఫూర్తితో బహుజన సమాజ్ పార్టీ ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణ పేదలు, మత మైనారిటీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు సమానంగా అందేలా బీఎస్పీ నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి కామ్రేడ్ పోశెట్టి, జిల్లా ఉపాధ్యక్షులు సంపంగి వెంకటేష్, ఆదిలాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు దుమ్మ శ్రీహరి, బోథ్ అసెంబ్లీ అధ్యక్షులు ఇస్తారి, ఆదిలాబాద్ నియోజకవర్గ కోశాధికారి ముఖ్యర వెంకటేష్ తదితర బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE