ఆదివాసి చిన్నారుల పట్ల మానవతా హృదయం చాటిన మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్
జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా మార్చి విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు పంపిణీ
మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ పట్టణంలోని కొమరం భీమ్ కాలనీలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ తన జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. ఆదివాసి చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదినాన్ని జరుపుకోవడంతో పాటు వారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా సమీపంలోని పాఠశాలను సందర్శించిన ఆమె అక్కడ విద్యార్థులు కనీస విద్యా సామగ్రి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించారు. చిన్నారుల అవసరాలను గుర్తించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వెంటనే స్పందించి, అదే రోజు మధ్యాహ్నం మరోసారి పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, స్కూల్ బ్యాగులు, రైటింగ్ వైట్‌బోర్డు అందజేశారు.

ఈ సందర్భంగా బండారి అనూష సతీష్ మాట్లాడుతూ, సమాజంలో వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చిన్నారుల భవిష్యత్తు కోసం అవసరమైన విద్యా వనరులు అందుబాటులో ఉండాలని, విద్య ద్వారానే వారి జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
స్థానికులు, ఉపాధ్యాయులు ఆమె సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, జన్మదిన వేడుకలను సామాజిక సేవతో ముడిపెట్టడం ఆదర్శనీయమని కొనియాడారు. చిన్నారులు కూడా విద్యా సామగ్రి అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు.
సమాజ సేవకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన చోట తక్షణ స్పందనతో ముందుకు రావడం మున్సిపల్ చైర్‌పర్సన్ సామాజిక బాధ్యతకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.
వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు జాదవ్ శ్రావణ్ కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో పని చేయుటకు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
