దాతాజీ కుటుంబానికి పరామర్శ..

Published on

-Advertisement-

దేవాపూర్‌లో దాతజీ సుజాత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్

బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు దాతజీ కిరణ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో ఇటీవల పరమపదించిన దాతజీ సుజాత కుటుంబ సభ్యులను ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ పరామర్శించారు. బీజేపీ యువమోర్చా తలమడుగు మండల అధ్యక్షుడు దాతజీ కిరణ్ అన్నయ్య దివంగత దాతజీ వామన్ సతీమణి అయిన దాతజీ సుజాత మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా పతంగి బ్రహ్మానంద్ దేవాపూర్‌లోని వారి నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను, ముఖ్యంగా కుమారుడు దాతజీ శ్రీనివాస్ ను పరామర్శించారు. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మానసిక ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ, ఇలాంటి క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీ తరఫున కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

మరణం కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న ఆయన, సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాంటి సందర్భాల్లో బాధిత కుటుంబాలకు మానసికంగా అండగా నిలవాలని అన్నారు. దాతజీ సుజాత గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులర్పించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో దేవాపూర్ గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్, ఝరి గ్రామ సర్పంచ్ కాశీరాం, శానం శ్రీనివాస్, వార్డ్ సభ్యులు ఓస రవి, సీపతి నగేష్, గోడం భుజంగ్ రావు, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కోరండ్ల పురుషోత్తం, బొమ్మిని అశోక్, నవీన్, పోరండ్ల రాములు, శాగంటి విష్ణు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

గ్రామంలో విషాద వాతావరణం నెలకొనగా, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్థులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్

ఆదిలాబాద్ జిల్లాలో పని చేయుటకు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను. ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం

గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల...

More like this

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...