వర్షాలకు దెబ్బతిన్న బీటీ రోడ్డు.. తెగిపోయిన వంతెన….!

Published on

-Advertisement-

వర్షాలకు దెబ్బతిన్న బీటీ రోడ్డు.. తెగిపోయిన వంతెన….!

లక్ష్మీపూర్–లచ్చంపూర్ ప్రధాన రహదారికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్–లచ్చంపూర్ ప్రధాన రహదారి గత నెలలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు మార్గమధ్యంలోని వంతెన కూడా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే గ్రామస్థులు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ రాకపోకలు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాల కారణంగా బీటీ రోడ్డు పలు చోట్ల గుంతలమయంగా మారగా, వంతెన దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నారులను ఆసుపత్రులకు తరలించడం కూడా కష్టసాధ్యంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు.

గ్రామస్తులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు గ్రామాలకు వచ్చి హామీలు ఇస్తున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామాల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి దెబ్బతిని నెలలు గడుస్తున్నా మరమ్మతులు ప్రారంభం కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాధా మనోహర్ మాట్లాడుతూ, లక్ష్మీపూర్–లచ్చంపూర్ రహదారి, దెబ్బతిన్న వంతెన సమస్యను ఇప్పటికే బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సమస్య తీవ్రతను ఎమ్మెల్యేకు వివరించగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా మరమ్మత్తు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

అయితే వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా తక్షణమే రహదారి, వంతెన మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని గ్రామ పెద్దలు, యువత, రైతులు, మహిళలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడక ముందే అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్

ఆదిలాబాద్ జిల్లాలో పని చేయుటకు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను. ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...