వర్షాలకు దెబ్బతిన్న బీటీ రోడ్డు.. తెగిపోయిన వంతెన….!
వర్షాలకు దెబ్బతిన్న బీటీ రోడ్డు.. తెగిపోయిన వంతెన....! లక్ష్మీపూర్–లచ్చంపూర్ ప్రధాన రహదారికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్–లచ్చంపూర్ ప్రధాన రహదారి గత నెలలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు మార్గమధ్యంలోని వంతెన కూడా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే గ్రామస్థులు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ రాకపోకలు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....