e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

గంజాయి నిర్మూలనకే తొలి ప్రాధాన్యత: ఎస్పీ

మహిళల భద్రత, గంజాయి నిర్మూలనకే తొలి ప్రాధాన్యత: విజయనగరం ఎస్పీ ఎ.ఆర్. దామోదర్

విజయనగరం, జూన్ 13: మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణ, రహదారి భద్రత వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో మరింత ప్రభావవంతమైన చర్యలు చేపట్టాలని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలోని నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, రేగిడి ఆముదాలవలస పోలీస్ స్టేషన్లను ఆయన శుక్రవారం సందర్శించి, పోలీసు స్టేషన్ల పనితీరు, పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణను పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎస్పీ, ప్రస్తుత పరిస్థితుల్లో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల రక్షణ, గంజాయి నిర్మూలన కోసం గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. మహిళల్లో అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

గంజాయి నియంత్రణలో భాగంగా అనుమానాస్పద ప్రాంతాలపై నిఘా పెంచడంతో పాటు సమాచార సేకరణను బలోపేతం చేయాలని చెప్పారు. గంజాయి విక్రయాలు, రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు రూపొందిస్తున్న షార్ట్ ఫిల్మ్స్, సోషల్ మీడియా పోస్టులు, గోడ పత్రికలు, కరపత్రాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

అవగాహన కార్యక్రమాల్లో భాగంగా సైబర్ భద్రత, రహదారి భద్రత, హెల్మెట్ వినియోగం, వాట్సాప్ వీడియో కాల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు సైబర్ నేరాలకు బలికాకుండా జాగ్రత్తలు పాటించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

ఎంఎస్పీలు, శక్తి బృందాలు తరచూ విద్యాసంస్థలను సందర్శించి మహిళల భద్రత, రక్షణ, చట్టాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. చిన్నారుల రక్షణ దృష్ట్యా ప్రాథమిక పాఠశాలల్లో “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

నేరాల నియంత్రణలో భాగంగా లాడ్జీలు, వాహనాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, రికార్డులను క్రమం తప్పకుండా పరిశీలించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే లాడ్జి యాజమాన్యాలు, వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రంకన్ డ్రైవ్, మోటారు వాహన చట్ట ఉల్లంఘనలపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశించారు.

రహదారి ప్రమాదాల నివారణకు గ్రామాలు, పట్టణాల్లో వేగ నిరోధకాలను ఏర్పాటు చేసి వాటిపై రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించేలా రేడియం స్టిక్కర్లు అమర్చాలని సూచించారు. దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేసి వ్యవస్థను సమర్థంగా వినియోగించాలని చెప్పారు.

పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు స్థానిక వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికలను సమర్థంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాలను నిబంధనల మేరకు యజమానులకు అప్పగించాలని చెప్పారు.

ఈ సందర్భంగా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పురుష, మహిళా పోలీసు సిబ్బంది కోసం ప్రత్యేకంగా నిర్మించిన రెండు విశ్రాంతి గదులను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అనంతరం నెల్లిమర్ల, గుర్ల, గరివిడి పోలీసు సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేసి, ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని భరోసా కల్పించారు.

అనారోగ్య సమస్యలు, ఆకస్మిక ప్రమాదాల సమయంలో మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ప్రతి పోలీసు ఉద్యోగి ఎస్‌బీఐ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించారు. అలాగే పోలీసు సిబ్బంది జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాల రోజున కుటుంబ సభ్యులతో సమయం గడిపేలా ప్రత్యేక అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీల్లో చీపురుపల్లి డీఎస్పీ ఎస్. రాఘవులు, భోగాపురం రూరల్ సీఐ జి. రామకృష్ణ, చీపురుపల్లి సీఐ జి. శంకరరావు, నెల్లిమర్ల ఎస్ఐ గోపాలరావు, గుర్ల ఎస్ఐ పి. నారాయణరావు, గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు, రేగిడి ఆముదాలవలస ఎస్ఐ బాలకృష్ణతో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE