విజయనగరం అభివృద్ధికి సమిష్టిగా కృషి..

Published on

-Advertisement-

సమకాలీన రాజకీయాలు, జిల్లా అభివృద్ధిపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ – ఎమ్మెల్యే అదితి భేటీ

పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ

మన భారత్ | విజయనగరం

విజయనగరం జిల్లాలో సమకాలీన రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాలపై రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి ఆదిత్య విజయలక్ష్మి (అదితి) సోమవారం సమావేశమయ్యారు.

విజయనగరం పట్టణంలోని ఎమ్మెల్యే అదితి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీ దాదాపు అరగంటకు పైగా కొనసాగింది. జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల అవకాశాలు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అంశాలపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. విజయనగరం జిల్లాను రాష్ట్రంలో అగ్రగామి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తోందని తెలిపారు.

ఎమ్మెల్యే పూసపాటి ఆదిత్య విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాల కల్పన, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే లక్ష్యంతోనే అమలు అవుతోందన్నారు.

ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, ఇది రైతుల పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. రైతుల హక్కులను పరిరక్షిస్తూ, భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత వంటి అంశాల్లో కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో పనిచేస్తోందన్నారు.

గత ప్రభుత్వానికి దీటుగా కాకుండా మరింత మెరుగైన పాలన అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి స్పష్టం చేశారు.

రానున్న రోజుల్లో విజయనగరం జిల్లాను అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల రంగాల్లో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...