రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల ప్రతిభ..!

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:
తెలంగాణ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ నాలుగో తరగతి ప్రవేశ ఎంపిక పరీక్షల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారని జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి జక్కుల శ్రీనివాస్ తెలిపారు. మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, కోచింగ్ అందించామని తెలిపారు. క్రమశిక్షణతో సాధన చేయడం వల్లే విద్యార్థులు రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబరిచారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లల్లో కూడా క్రీడా నైపుణ్యాలు ఎంతో ఉన్నాయని పేర్కొన్నారు.

స్పోర్ట్స్ స్కూల్ ఎంపికల్లో ఆదిలాబాద్ జిల్లాకు ఈ స్థాయిలో అవకాశం రావడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత రాణించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలని సూచించారు.

ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 13, 14 తేదీల్లో హకీంపేట్‌లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అవసరమైన ధ్రువపత్రాలు, వివరాలతో విద్యార్థులు హాజరుకావాలని సూచించారు.

క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, చిన్న వయస్సు నుంచే ప్రతిభావంతులను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా భవిష్యత్తులో మంచి క్రీడాకారులు తయారవుతారని అధికారులు తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సాధించిన ఈ విజయంపై క్రీడా వర్గాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో విధులు నిర్వర్తించాలి

పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు.. వర్షాకాలంలో నదులు, వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని...

CEIRలో ఫిర్యాదు చేస్తే మొబైల్ ఫోన్‌ను తిరిగి పొందే అవకాశం: ఎస్పీ

పోయిన మొబైల్ ఫోన్లను వెతికి పట్టిన ఆదిలాబాద్ పోలీసులు రూ.12.5 లక్షల విలువైన 105 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగింత.....

మా టీచర్ ను మాకే కేటాయించాలని ఎంఈవోకు వినతి

వడ్గావ్ పాఠశాలకు ఉపాధ్యాయుడిని తిరిగి కేటాయించాలి.. -ఎంఈఓకు గ్రామస్తుల వినతి మన భారత్ | ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని...

ఆ సర్పంచ్ సస్పెండ్ .!

నకిలీ పత్తి విత్తనాల కేసు.. దాబా(బి) సర్పంచ్ సస్పెన్షన్ మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల...

More like this