సీఎం జోసెఫ్ విజయ్ కు అభినందనలు..

Published on

-Advertisement-

ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం హర్షణీయం : దళిత సంఘాల నేతలు

మన భారత్, విజయనగరం:
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కు విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గానికి చెందిన పలువురు దళిత సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం సామాజిక మార్పుకు నిదర్శనమని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జై భీమ్ రావు భారత్ పార్టీ తరఫున గజపతినగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పెంట శంకర్రావు, రెళ్లి సంఘం నియోజకవర్గ అధ్యక్షులు గండ్రేటి రామారావు మాట్లాడుతూ ప్రజల మద్దతుతో ఎదిగిన నాయకులు అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతమని అన్నారు. ముఖ్యంగా క్రిస్టియన్ వర్గానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం పట్ల దళిత, బడుగు బలహీన వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోందని తెలిపారు.

రాజకీయాల్లో సామాన్య ప్రజలకు ప్రాధాన్యత పెరగాలని, సామాజిక న్యాయం ప్రతిబింబించే విధంగా నాయకత్వ మార్పులు రావాలని వారు ఆకాంక్షించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సంతకం చేయడం అభినందనీయమని అన్నారు.

పేదల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వారు సూచించారు. సంక్షేమ పథకాల అమలుతో సామాన్య కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు.

ఇలాంటి ప్రజా సంక్షేమ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలవాలని దళిత సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

విద్యా కమిషన్ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ ఆందోళన..

ప్రభుత్వ పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తున్నాం.. విద్యా కమిషన్ ప్రతిపాదనలపై తెలంగాణ రక్షణ సేన ఆందోళన మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో...

రైతులు ప్రజల రక్షణే ప్రభుత్వ లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్  వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి ఆదిలాబాద్, జూలై 21: రైతుల సంక్షేమం,...

నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా..

మన భారత్, ఆదిలాబాద్ నీటి సంరక్షణే భవిష్యత్‌కు భరోసా.. భూగర్భ జలాల పెంపుపై దృష్టి పెట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్,...

రైతులకు నీళ్లు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్: కల్వకుంట్ల కవిత

రైతులకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం: టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆరోపణ మన భారత్, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌తో...

More like this