జియో యూజర్లకు మరో షాక్..!

Published on

-Advertisement-

మన భారత్, న్యూఢిల్లీ: 

టెలికాం రంగంలో కీలక సంస్థ అయిన రిలయన్స్ జియో తమ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. చౌకైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌గా గుర్తింపు పొందిన రూ.209 ప్లాన్‌ను పూర్తిగా తొలగించింది. గత ఏడాదిలోనే ఈ ప్లాన్‌ను అధికారికంగా నిలిపివేసినప్పటికీ, “మై జియో” యాప్‌లో కొంతమేర అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు ఆ ప్లాట్‌ఫామ్ నుంచి కూడా పూర్తిగా తొలగించడం గమనార్హం.

ఈ నిర్ణయం వల్ల తక్కువ ఖర్చుతో డేటా మరియు కాలింగ్ సేవలు పొందుతున్న యూజర్లపై అదనపు భారం పడే అవకాశం ఉందని టెలికాం విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బడ్జెట్ ప్లాన్లపై ఆధారపడే వినియోగదారులు ఈ మార్పుతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

గతంలో రూ.209 ప్లాన్ కింద జియో వినియోగదారులకు 22 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు అందించేది. ఈ ప్లాన్ తక్కువ ధరలో సరసమైన ప్రయోజనాలను అందించడంతో విస్తృతంగా వినియోగంలో ఉండేది.

జియో తాజా నిర్ణయంతో వినియోగదారులు ఇప్పుడు అధిక ధరల ప్లాన్ల వైపు మళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. టెలికాం మార్కెట్లో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు తమ వ్యూహాలను మారుస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఫోన్ వినియోగించే కస్టమర్లు తమకు ఇన్కమింగ్ ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లో ఉచితంగా ఇన్కమింగ్ ఇవ్వాలని అంటున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేయాలి..

మన భారత్,మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామపంచాయతీ ,మొగుళ్ళపల్లి రైతు వేదికలో వ్యవసాయ అధికారి సురేందర్...

పాఠశాలలో కంటైనర్ టాయిలెట్స్ ప్రారంభం

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ చే...

భక్తులకు మహా అన్నప్రసాద వితరణ..

మొగుళ్లపల్లి ముదిరాజ్ యువజన సంఘం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాద వితరణ మన భారత్,మొగుళ్ళపల్లి: శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా...

గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం

గుండాల గోండు గూడలో ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమం.. ఉచిత వైద్య శిబిరం యువతకు క్రీడా కిట్లు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నుల...

More like this