e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

ఆకుకూరల సాగుతో లాభాల బాట.!

మన భారత్, తలమడుగు:,:

తలమడుగు మండలంలోని దేవాపూర్, కుచాలాపూర్ గ్రామాల రైతులు ఆకుకూరల సాగుతో మంచి లాభాలు పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించిన రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు.

ప్రధానంగా తోటకూర, పాలకూర, మెంతి వంటి ఆకుకూరలను ఉద్యాన శాఖ సహకారంతో సాగు చేస్తున్నారు. ఈ పంటలు కేవలం 30 నుంచి 35 రోజుల్లోనే దిగుబడికి వస్తుండటంతో రైతులకు వేగంగా ఆదాయం లభిస్తోంది. రోజుకు సుమారు రూ.1500 వరకు సంపాదిస్తూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వేసవి కాలంలో ఆకుకూరలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు అదనపు లాభాలు వస్తున్నాయి. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో సాగు చేయగల ఈ పంటలు చిన్న రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి.

ఉద్యాన శాఖ అధికారులు రైతులకు సాంకేతిక సహాయం అందిస్తూ, నాణ్యమైన విత్తనాలు, సాగు పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారని రైతులు తెలిపారు. దీనివల్ల పంటల దిగుబడి మెరుగుపడడంతో పాటు మార్కెట్లో మంచి ధర లభిస్తున్నదన్నారు.

ఇతర రైతులు కూడా సంప్రదాయ పంటలతో పాటు ఆకుకూరల సాగుపై దృష్టి సారిస్తే తక్కువ కాలంలోనే మంచి ఆదాయం పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE