కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..

Published on

-Advertisement-

మన భారత్ | మొగుళ్లపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండల కేంద్రంలో సంక్షేమం మరియు వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక కార్యక్రమాలు నిర్వహించారు. రైతు వేదిక భవనంలో మండలానికి చెందిన 61 మంది లబ్ధిదారులకు రూ. 61,07,076 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కళ్యాణ లక్ష్మి వంటి పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. అనంతరం మండలంలోని ముల్కలపల్లి, మొట్లపల్లి, మెట్టుపల్లి, మొగుళ్లపల్లి, ఇస్సిపేట, రంగాపురం గ్రామాలలో పీఏసీఎస్, ఐకెపి కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

రైతులకు మద్దతుగా సన్నధాన్యానికి రూ. 2,389 మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోత మిషన్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, ఆర్పిఎం 18 నుంచి 20 వరకు బ్లోయర్ ఆన్‌లో ఉంచే విధంగా యజమానులకు సూచించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఇలా చేయడం వల్ల ధాన్యంలో తాలు తగ్గుతాయని వివరించారు.

రైతులు తమ పంటను మధ్యవర్తులు లేకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని, రైతులకు సమయానికి చెల్లింపులు జరుగుతాయని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ ప్రమాణాలు, కొలతలు సక్రమంగా పాటించాలని అధికారులకు సూచనలు చేశారు.

రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, వైస్ చైర్మన్ ఎండి రఫీ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సంపెల్లి నరసింగరావు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆర్టీసీ కార్మికులకు ధైర్యం కోల్పోవద్దు…

మన భారత్ | మొగుళ్లపల్లి: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో భావోద్వేగాలకు లోనవకుండా ధైర్యంగా పోరాటం కొనసాగించాలని బీసీ...

దివ్యాంగులకు వ్యాపార నైపుణ్య శిక్షణ.!

మన భారత్ | ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల ఆత్మనిర్భరత కోసం నిర్వహించిన వ్యాపార నైపుణ్య శిక్షణ కార్యక్రమం...

వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు..

మన భారత్ ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి కీలక చర్యలు చేపట్టారు....

శ్రీ కృష్ణ నామం పరమ ఔషధం..

మన భారత్ , భక్తి: కలియుగంలో భక్తులకు అత్యంత సులభమైన మరియు శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా కృష్ణనామ స్మరణను శాస్త్రాలు...

More like this

ఆర్టీసీ కార్మికులకు ధైర్యం కోల్పోవద్దు…

మన భారత్ | మొగుళ్లపల్లి: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో భావోద్వేగాలకు లోనవకుండా ధైర్యంగా పోరాటం కొనసాగించాలని బీసీ...

దివ్యాంగులకు వ్యాపార నైపుణ్య శిక్షణ.!

మన భారత్ | ఆదిలాబాద్ :  ఆదిలాబాద్ జిల్లాలో దివ్యాంగుల ఆత్మనిర్భరత కోసం నిర్వహించిన వ్యాపార నైపుణ్య శిక్షణ కార్యక్రమం...

వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు..

మన భారత్ ,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి కీలక చర్యలు చేపట్టారు....