e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ 

బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఘన నివాళులు

మన భారత్, తలమడుగు:

తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షులు దాతాజీ కిరణ్ గారు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా” అనే లక్ష్యంతో దేశ సమగ్రత కోసం పోరాడి కాశ్మీర్ కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఆయన ఆశయాలు, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

దేశ ఐక్యత, సమగ్రత కోసం ముఖర్జీ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శానం శ్రీనివాస్, అడెపు శ్రీనివాస్, పిట్ల శేఖర్, రేగుల మోహన్, పోరండ్ల రాములు, విష్ణు, ఓస రవి, గంగాధర్, గంధం నరేష్, సంతోష్, రాజు, రామన్న, పొచ్చన్న, లింగం తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగాలను స్మరించుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE