e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి….

మన భారత్, ఆదిలాబాద్:
జిల్లాలోని దివ్యాంగుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు 2016 చట్టం ప్రకారం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా మేడం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించబడింది.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారుల సమక్షంలో కమిటీ సభ్యులను సన్మానించి వారి బాధ్యతలను గుర్తు చేశారు.

జిల్లాలోని దివ్యాంగులకు అవసరమైన సేవలు, సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయాలని అధికారులు పేర్కొన్నారు. దివ్యాంగుల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రవీందర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ అధికారులు ధన్యవాదాలు తెలిపారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE