దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి….
మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని దివ్యాంగుల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు 2016 చట్టం ప్రకారం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్కా మేడం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ శాఖల అధికారుల సమక్షంలో కమిటీ సభ్యులను సన్మానించి వారి...