డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు షురూ.!

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ: 

బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు తమకు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర విద్యాసంస్థల్లో ఇంటర్ పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సిందిగా సూచించారు. దరఖాస్తుల సమర్పణకు మే 10 చివరి తేదీగా నిర్ణయించారు.

ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు సమయానికి దరఖాస్తులు పూర్తి చేసి అవసరమైన పత్రాలు సమర్పించాలని తెలిపారు.

ఆన్లైన్ లో.. mjptbcwreis.https://telangana.gov.in

ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 040-23328266 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని కార్యదర్శి సూచించారు. విద్యార్థుల ఉన్నత విద్యకు గురుకుల కాలేజీలు ఉత్తమ వేదికగా నిలుస్తాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సూపర్ నారీ పై అవగాహన సదస్సులు..

మన భారత్, విజయనగరం:  గ్రామ సంఘాల్లో “మన డబ్బులు – మన లెక్కలు” సభ్యుల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపే...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై నారాయణరావు

మన భారత్, విజయనగరం:  రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు గుర్ల, జూన్ 6: గుర్ల మండల కేంద్రంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం

మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే...

లో లెవల్ వంతెనల పూర్తి ఎప్పుడో.?

మన భారత్, ఆదిలాబాద్:  ఝరి, డోర్లి గ్రామాల ప్రజల ఆవేదన – వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు తలమడుగు: తలమడుగు మండల...

More like this