బాటసారులకు శీతల జల సేవ..

Published on

-Advertisement-

వాంకిడి, మన భారత్:

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జెత్వన్ బుద్ధ విహార్ ఎదుట ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని శుక్రవారం ఉదయం వాంకిడి ఇంచార్జి ఎంపీడీవో ఖాజా అజీజోద్దీన్ , సబ్ ఇన్స్పెక్టర్ దుర్గం మహేందర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ జిల్లా సంఘటకులు మార్షల్ దుర్గం సందీప్ మాట్లాడుతూ, పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్లపై ప్రయాణించే బాటసారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజలు ఈ సేవను వినియోగించుకోవాలని కోరారు.

సామాజిక సేవా దృక్పథంతో నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు అందుకుంది. ప్రజలకు అవసరమైన సమయంలో ఇలాంటి సేవలు అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు దుర్గం దుర్గాజి, ప్రధాన కార్యదర్శి విజయ్, గౌరవాధ్యక్షులు జయరాం, సమతా సైనిక్ దళ్ నాయకులు ప్రతాప్, రోషన్, మిలింద్, రమేష్, కమలాకర్, మార్షల్స్ సాజన్, స్వాగత్, ఆకాష్, ఉపాధ్యక్షులు శ్యామరావు, దొండుజి, దుర్గే, సమాజ పెద్దలు శ్యామరావు, రాజేశ్వర్, సామాజిక కార్యకర్త డోంగ్రే ప్రవీణ్, ఉపేందర్, నగసేన, సురేందర్, బుద్ధజీ, నూతన్, దీపరత్న, పవన్, ప్రేమ్‌సాగర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ నాయకులకు శుభవార్త.. https://manabharath.com/7179/

మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆ కౌన్సిలర్ పై కేసు నమోదు..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు గణపతి నిమజ్జన బందోబస్తులో ఆటంకాలు.. ముగ్గురిపై కేసులు నమోదు మద్యం సేవించి ప్రజాశాంతికి...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి.. 200...

ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం

నెల రోజుల్లోనే వ్యవసాయ విద్యుత్‌ సౌకర్యం.. ఏఈ సతీష్‌కుమార్‌కు రైతుల సన్మానం డీడీలు చెల్లించిన వెంటనే స్పందన.. ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు...

రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ..

గిన్నెరలో రిమ్స్‌ ఘటన బాధిత కుటుంబానికి కవిత పరామర్శ చిన్నారి తల్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం.. అండగా ఉంటామని భరోసా...

More like this