అనుమానంతో కొడుకును హత్య చేసిన తండ్రి.!

Published on

-Advertisement-

మన భారత్, విజయపుర: 

కుమారుడికి తన పోలికలు రాలేదన్న అనుమానంతో ఓ తండ్రి తన సొంత బిడ్డ ప్రాణాలు తీశాడు. కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా నాగఠాణె గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన మల్లికార్జున, భాగ్యశ్రీ దంపతులకు సిద్ధార్థ (6) అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. అయితే బాలుడు తన పోలికలు లేవన్న అనుమానం మల్లికార్జునకు గత ఏడాదిన్నరగా వేధిస్తోంది. ఈ అనుమానంతో అతను మానసికంగా అసహనానికి లోనయ్యాడు.

మార్చి 16న కుమారుడిని పాఠశాలలో చేర్పిస్తానని భార్యకు చెప్పిన మల్లికార్జున, సిద్ధార్థను తీసుకుని మహారాష్ట్రలోని మడీలి భికేశ్వర గ్రామ సమీపానికి వెళ్లాడు. అక్కడ కృష్ణానదిలోకి బాలుడిని తోసి హత్య చేశాడు. అనంతరం ఇంటికి వచ్చి బాలుడిని హాస్టల్‌లో చేర్పించి వచ్చానని భార్యను నమ్మించాడు.

రెండు రోజుల తరువాత, మార్చి 18న కృష్ణానదిలో బాలుడి మృతదేహం లభించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కుమారుడి గురించి అనుమానం కలిగిన భాగ్యశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. విచారణలో నిజాలు బయటపడటంతో పోలీసులు మల్లికార్జునను అరెస్టు చేశారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ సంబంధాల్లో అనుమానాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది.

రాజకీయ నాయకులకు శుభవార్త..!

https://manabharath.com/7179/

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

More like this