అక్రమ మద్యం తరలింపు.. ఒకరు అరెస్ట్

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి దేశీ దారు సీసాలను అక్రమంగా తరలిస్తూ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

ఎక్సైజ్ శాఖకు అందిన పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విజేందర్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కుచులాపూర్ గ్రామానికి చెందిన కాంపల్లి రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం 58 దేశీ దారు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

తలమడుగు మండలంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని వచ్చిన సమాచారంపై ఈ చర్యలు తీసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విజేందర్ వెల్లడించారు. నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా అధికారులు హెచ్చరిస్తూ, అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని కోరారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

More like this