మార్చి 15లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

వచ్చే నెల 15వ తేదీలోగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఢిల్లీలో AICC పెద్దలతో రాష్ట్ర మంత్రులు, కీలక నాయకులు సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పార్టీ అధిష్ఠానం సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి తీసుకున్న చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.

ఇక మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపైనా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. త్వరలోనే ఆయనతో సంప్రదింపులు జరిపి స్పష్టతకు వచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై మరో రెండు రోజుల్లో మళ్లీ చర్చలు జరగనున్నాయని, పార్టీ తుది నిర్ణయం అధిష్ఠానం ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల దృష్ట్యా నామినేటెడ్ పదవుల భర్తీకి వేగం పెంచుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.

Latest articles

గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్

చీపురుపల్లిలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్.. గంజాయితో ముగ్గురు యువకులు అరెస్ట్ విజయ కాలనీలో విస్తృత తనిఖీలు.. గంజాయి నిర్మూలనపై...

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ రీజోనెన్స్ పాఠశాలలో...

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

More like this