మే తొలి వారంలో కవిత కొత్త పార్టీ ప్రకటింపు?

Published on

-Advertisement-

మన భారత్, హైదరాబాద్:

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మే నెల తొలి వారంలో శుభముహూర్తం చూసుకొని అధికారికంగా పార్టీని ప్రకటిస్తానని తెలిపారు.

పార్టీ పేరులో “తెలంగాణ” పదం తప్పక ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర ఆత్మగౌరవం, ప్రాంతీయ హక్కుల పరిరక్షణ లక్ష్యంగా కొత్త రాజకీయ వేదికను ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని చెప్పారు. మొదటి ప్రాధాన్యతగా సిద్దిపేట నియోజకవర్గాన్ని, రెండో ఎంపికగా బోధన్‌ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

రాజకీయ వర్గాల్లో ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్టీ ఆవిర్భావం తెలంగాణ రాజకీయ సమీకరణాలపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

Latest articles

పోలీసుల ఆరోగ్యమే ప్రజల భద్రతకు బలం..

మన భారత్, ఆదిలాబాద్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ యశోద హాస్పిటల్స్ సహకారంతో...

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవు..

మన భారత్, ఆదిలాబాద్ ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన విద్యార్థుల హాజరు.. 9 మంది ఎంఈవోలకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు సిరికొండ, గుడిహత్నూర్...

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

More like this