e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ 

ఆదిలాబాద్ , మన భారత్:

తాంసి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, తాంసి మాజీ జడ్పీటీసీ తాటిపెల్లి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ వేడుకలకు శోభను చేకూర్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ, దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో లక్షీ, మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో మోహన్ రెడ్డి, పోలీస్ స్టేషన్ లో ఎస్సై జీవన్ రెడ్డి, ప్రాథమిక సహకార సంఘంలో సీఈవో శ్రీనివాస్, ఆరోగ్య కేంద్రం లో వైద్యాధికారి శ్రావ్య వాణీ, ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులు జెండా ను ఆవిష్కరించారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. దేశభక్తి నినాదాలతో మండల కేంద్రం మార్మోగగా, ప్రజల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.

ఈ వేడుకలు ప్రజల్లో ఐక్యత, సమైక్యత భావాలను మరింత బలోపేతం చేశాయని పాల్గొన్నవారు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE