30వ అఖండ హరినామ మహాయజ్ఞోత్సవానికి భక్తులకు ఆహ్వానం
మన భారత్, ఆదిలాబాద్:
సంత్ శ్రీ సద్గురు నారాయణబాబా ఆశీస్సులతో పల్సీ గ్రామంలో 30వ అఖండ హరినామ మహాయజ్ఞోత్సవాన్ని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సద్గురు సంస్థాన్ అధ్యక్షులు జాదవ్ కిషన్ ప్రకటించారు. ఈ మహాయజ్ఞోత్సవం జనవరి 2 నుంచి 4 వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో జరగనుందని తెలిపారు. దత్తగురు, సద్గురు సంత్ శ్రీ సద్గురు నారాయణబాబా నామ స్మరణతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా సాగనున్నాయి.
జనవరి 2, 2026 శుక్రవారం సాయంత్రం 4.15 గంటలకు శ్రీ సంత్ సద్గురు నారాయణబాబా గారి రథోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం జై హనుమాన్ పదావలి భజన్ మండలి (జామిని), హోరియ ఖేల్, చోర్గావ్ వారి కార్యక్రమాలు భక్తులను అలరించాయి. రాత్రి 8.30 గంటల నుంచి శ్రీ రేణుక ఎల్లమ్మ నృత్య మండలి, గిమ్మ భజన కార్యక్రమం నిర్వహించనున్నారు.

జనవరి 3, 2026 శనివారం ఉదయం 4.15 గంటలకు బాబా గారి మూలవిరాటికి అభిషేకం, ఉదయం 5.15 గంటలకు ధ్వజారోహణ అనంతరం మంగళహారతి జరుగుతుంది. ఉదయం 7.42 గంటలకు మహాయజ్ఞం ప్రారంభమవుతుందని భక్తులు సకాలంలో హాజరు కావాలని కోరారు. ఉదయం 9 గంటల నుంచి సాధ్వి మహంత్ ముక్తాయినాథ్ మావులి ద్వారా జ్ఞానేశ్వరి పై జ్ఞానబోధన ప్రవచన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటల నుంచి మహాప్రసాదం (అన్నదానం) కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

జనవరి 4, 2026 ఆదివారం గోపాలకాల ఉత్సవం, సాయంత్రం 5.15 గంటలకు ఉట్టి కొట్టడం, సాయంత్రం 6.15 గంటలకు హారతి కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ మూడు రోజుల ఉత్సవాల్లో భాగంగా మహా అన్నదానం, మూడు రోజుల తీర్థయాత్ర, పేదలకు వస్త్రదానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంస్థాన్ అధ్యక్షులు జాదవ్ కిషన్ తెలిపారు.
ఈ మహాయజ్ఞోత్సవానికి పల్సీ గ్రామ పెద్దలు శ్రీ ఆర్తిబాయి ప్రభు రాథోడ్ (సర్పంచ్), శ్రీ సునిల్ జాధవ్ (ఉప సర్పంచ్), శ్రీ నాధవ్ మణిరామ్ (సొసైటీ చైర్మన్), శ్రీ పామునాయిద్ షల, శ్రీ ప్రంచ్ ప్రియాగిరాజ్ గౌరి మహారాజ్ పై యుకిరామ్, చిత్తశిఖర్ సంస్థాన్, నిహ, చింతామణి భారతి గురు ధనరాజ్ భారతి శిఖర్ సంస్థాన్ మోహర్గర్ తదితరులు సహకారం అందిస్తున్నారు.
గురుపీఠాధికారి బాబా గారి దత్త పుత్రిక శ్రీ గురు సోనుమాత దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అలాగే హారియ భేర్ నృత్య మండలి, చోరగాండ్ పాల్గొననుంది. సంస్థాన అధ్యక్షులు శ్రీ జాధవ్ కిషన్ ఆధ్వర్యంలో సంత్ శ్రీ సద్గురు నారాయణబాబా సంస్థాన్, వక్త మండలి, గ్రామస్తులు, శిష్య మండలి, గురుదేవ్ యూత్ కట్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని భక్తులకు నిర్వాహకులు ఆహ్వానం పలికారు.
