మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ సేవాభావం..

Published on

-Advertisement-

ఆసీంపూర్–కేర్గామాలో చలి దుప్పట్ల పంపిణీ

– మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ సేవాభావం

మన భారత్, ఆదిలాబాద్:

ఆసీంపూర్–కేర్గామా గ్రామంలో చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో చలి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని నిరుపేదలు, వృద్ధులు చలితో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సేవాభావంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షులు తోట శివన్న, ప్రధాన కార్యదర్శి బొల్లు ఈశ్వర్ దాస్, సభ్యులు వద్ది రవికాంత్ పాల్గొన్నారు. అలాగే కేర్గామా గ్రామ మున్నూరు కాపు మాజీ అధ్యక్షులు గాజుల సంజీవ్, ప్రధాన కార్యదర్శి పూచంశెట్టి దేవన్న కూడా కార్యక్రమానికి హాజరై దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చలి కాలంలో పేద ప్రజలకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, పరస్పర సహకారాన్ని పెంపొందిస్తాయని అన్నారు.

గ్రామస్థులు మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ సభ్యుల సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.

Latest articles

విదేశీ ఉద్యోగం పేరుతో రూ.6.51 లక్షల మోసం

ఏజెంట్‌తో పాటు సహకరించిన వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్‌కు తరలింపు మన భారత్, ఆదిలాబాద్: విదేశాలలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ...

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయించిన వ్యక్తికి రూ.50 వేల జరిమానా మన భారత్, ఆదిలాబాద్: బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి తిరిగి చట్టవిరుద్ధ...

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు

కాంగ్రెస్ అరాచకాలపై బీజేపీ పోరాటం ఆగదు -రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం -బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మోరే రవీందర్...

రాహుల్ గాంధీ పై దాడికి నిరసన..

రాహుల్ గాంధీ పై దాడికి నిరసన - రోడ్డుపై బైఠాయించిన మొగుళ్ళపల్లి మండల కాంగ్రెస్ శ్రేణులు మన భారత్, మొగుళ్ళపల్లి: కాంగ్రెస్...

More like this