చలి బాధితులకు మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ చేయూత
-పిప్పల్‌దరి, అర్లీ(బి) గ్రామాల్లో దుప్పట్ల పంపిణీ
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని పిప్పల్‌దరి, అర్లీ(బి) గ్రామాల్లో చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో చలి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షుడు తోట శివన్న నాయకత్వం వహించారు.
పిప్పల్‌దరి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షులు బోనగిరి నారాయణ, ప్రధాన కార్యదర్శి రాసం శ్రీనివాస్, కరమరుగుల సంటెన్న, మారిశెట్టి కిష్టయ్య, బండారి ఆడేళ్లు తదితరులు పాల్గొని గ్రామంలోని మున్నూరు కాపు కుల బంధువులకు చలి దుప్పట్లను అందజేశారు. చలి ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయుక్తంగా నిలిచిందని వారు పేర్కొన్నారు.

అదేవిధంగా ఆదిలాబాద్ గ్రామీణ మండలం అర్లీ(బి) గ్రామంలో కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షుడు తోట శివన్నతో పాటు ప్రధాన కార్యదర్శి బొల్లు ఈశ్వర్ దాస్, సభ్యులు వద్ది రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలోని మున్నూరు కాపు కుటుంబాలకు దుప్పట్లను అందజేసి చలికాలంలో వారికి భరోసా కల్పించారు.
సమాజంలో సేవా భావంతో ముందుకు వచ్చే ఇటువంటి కార్యక్రమాలు ఆదర్శప్రాయమని గ్రామస్తులు ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
