సీఐటియు రాష్ట్ర మహాసభల్లో మెరుపు రిపోర్టు!
నాగర్ కర్నూల్ జిల్లా సమస్యలను సమగ్రంగా ప్రవేశపెట్టిన సహాయ కార్యదర్శి పొదిల రామయ్య
మన భారత్, మెదక్: మెదక్ జిల్లాలో జరుగుతున్న సీఐటియు రాష్ట్ర మహాసభలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా తరఫున రిపోర్టును సీఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య సభ ముందుంచారు. జిల్లా వ్యాప్తంగా కూలీల సమస్యలు, కార్మిక హక్కులు, పెరుగుతున్న జీవనవ్యయ భారాలు, ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న లోపాలను వివరించిన ఆయన నివేదిక సభలో ప్రతిధ్వనించింది.
జిల్లాలో వ్యవసాయ కార్మికులు, నిర్మాణ కార్మికులు, హార్టికల్చర్, హస్తకళ రంగాల్లో పనిచేసే కూలీల పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని రామయ్య భావ వ్యక్తం చేశారు. కనీస వేతనాల అమలు సరిగా జరగకపోవడమే కాకుండా, కార్మికులకు సామాజిక భద్రతా పథకాలు కూడా చేరడం లేదని ఆయన మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు తగ్గడంతో వేలాది మంది మైగ్రేషన్ కు గురవుతున్నారన్న విషయాన్ని కూడా రిపోర్టులో ప్రస్తావించారు.
కూలీల హక్కుల కోసం మరింత పోరాటం అవసరమని, రాష్ట్రవ్యాప్తంగా సీఐటియు ఉద్యమాలను బలపర్చాలని రామయ్య పిలుపునిచ్చారు. ఆయన నివేదికకు సభ పాల్గొనేవారి నుంచి మంచి స్పందన లభించింది.
